ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోపి పెడుతున్న హెడ్‌ కానిస్టేబుల్‌ను సైబరాబాద్‌ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బాధితుల నుంచి రూ.1.68 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఏపీ జెన్‌కోలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగమిప్పిస్తానని రూ.10 లక్షలు వసూలు చేసి మోసం చేశాడంటూ వ్యాస్‌నగర్‌కు చెందిన బాధితుడు ఈ నెల 7న నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. మాదాపూర్‌ ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగి కర్నూలు జిల్లా ఓక్‌ మండలం ఉప్పలపాడుకు చెందిన బోయా షేక్‌ షావలీ(42)ని అరెస్టు చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ మండలం హైదర్షాకోటలో నివాసముంటూ..

టీఎస్‌ఎస్‌పీలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2019లో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో అప్పటి నుంచి ‘సిక్‌’ లీవ్‌లో ఉన్నాడు. గతంలో ప్రముఖుల వద్ద వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్‌వో)గా విధులు నిర్వహించాడు. అప్పుడు దిగిన ఫొటోలను ఇప్పుడు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని పలువురిని మోసగించి రూ.1.68 కోట్లు వసూలు చేసినట్లు లెక్క తేల్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.