హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారాన్ని అధికార టీఆర్‌ఎస్‌కు ధీటుగా హోరెత్తిం చాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభతో ఈ ప్రచారాన్ని ముగించాలని భావిస్తోంది. వేయి మందికి మించి బహిరంగ సభ, ర్యాలీలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో తొలుత అమిత్‌షా సభను రద్దు చేసుకున్నా.. తాజా పరిణామాల నేపథ్యంలో సభ నిర్వహించాలని పార్టీ అగ్రనాయకులు నిర్ణయించినట్లు సమాచారం.

ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ గెలుపును బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లను చేరుకునేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని నిర్ణయించింది. హుజూరాబాద్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని జాతీయ అధినాయకత్వం కూడా కచ్చితమైన ఆదేశాలు జారీచేయడంతో ఆ దిశగా వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కార్యాచరణ ప్రణాళికలను రాష్ట్ర నాయకత్వం రూపొందిస్తోంది. టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సంకేతాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు ఈ విజయం దోహదపడుతుందని భావిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.