హైదరాబాద్: పాతబస్తీ చాంద్రాయణగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్ వైపు కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని బయటకు లాగి నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.