కలెక్టరేట్‌ : వన్‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌ స్కీమ్‌, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఇంటింటి సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. గృహ నిర్మాణాల రుణాలపై వన్‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌ స్కీమ్‌ గురించి లబ్ధిదారులకు తెలియజేసి వారు ఉపయోగించుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసి నివేదికను పంచాయతీ సెక్రెటరీలకు అందజేయాలన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.