పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ సంస్థలకు వరాలివ్వడమే మోడీ దేశభక్తి అని సిఐటియు గోపాలపట్నం జోన్‌ ప్రధాన కార్యదర్శి బి.వెంకటరావు విమర్శించారు. విశాఖ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 195వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలనుద్దేశించి వెంకటరావు మాట్లాడుతూ, దేశభక్తి ముసుగులో మోడీ ప్రభుత్వం స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు దేశ సంపద, సహజవనరులను కట్టబెడుతోందని విమర్శించారు. నరేంద్రమోడీ అనుసరిస్తున్న కార్మిక, రైతు ప్రజావ్యతిరేక విధానాలను పోరాటాలు ద్వారానే నిలువరించగలమన్నారు. ఈ దీక్షల్లో పాల్గొన్న పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో గల ఏపి బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన హమాలీలను ప్రజాశక్తి బ్యూరో పలుకరించగా తీవ్రస్థాయిలో ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు.

By admin

Leave a Reply

Your email address will not be published.