మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆనందపురంలో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 1291 డ్వాక్రా గ్రూపులకు రూ.10,45,03,947 మంజూరైనట్లు తెలిపారు. అనంతరం డ్వాక్రా మహిళలకు చెక్కులు అందజేశారు. స్థానిక సర్పంచ్ చందక లక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు ముఖ్యమంత్రి జగన్కు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మజ్జి శారద ప్రియాంక, వైస్ ఎంపీపీ పాండ్రంగి శ్రీను, వైసిపి నాయకులు ముత్తంశెట్టి మహేష్, బంక సత్యనారాయణ, వరహాలరాజు శ్రీకాంత్, కె.వెంకట్రావు, మజ్జి వెంకట్రావు, జి.శ్రీను, మణిశంకర్ నాయుడు, చందక సూరిబాబు, షినగం రామారావు, చందక అప్పలస్వామి పాల్గొన్నారు