బిజెపి భావజాలంపై కార్మికవర్గం, రైతులు నిలబడి ప్రతిఘటిస్తే పోరాటాలకు మంచి రోజులు ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఉద్ఘాటించారు. స్టీల్‌ప్లాంట్‌ సిఐటియు కార్యాలయ ఆవరణలో సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కమిటీ ఆధ్వర్యాన ‘నేటి రాజకీయ పరిస్థితులు – కర్తవ్యం’ అన్న అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, బ్రిటీష్‌ ఇండియాలో దేశ ప్రజలు, కార్మికులు, రైతాంగం కలసి పోరాడబట్టే వ్యవసాయం, ప్రభుత్వ రంగ పరిశ్రమలను 74 ఏళ్లుగా రక్షించుకున్నామని, నేడు 3 నల్ల చట్టాలతో వ్యవసాయాన్ని నాశనం చెయ్యాలని మోడీ చూస్తున్నారని విమర్శించారు. ఈ అధికారం ఇలా సాగడానికి వీల్లేదన్నారు. డాబాగార్డెన్స్‌లో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.