‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు.. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. గురువారం మంచు విష్ణు, ట్రెజరర్ శివబాలాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 16 వ తేదీన జరిగే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారు మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచు విష్ణుకు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.