అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్ మహమ్మారికి చనిపోయిన వారి సంఖ్య 14,286కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 40,350 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 540 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా 20,59,122 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 557 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,588 యాక్టివ్ కేసులున్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.