ఏపీలో సెక్రటేరీయేట్, హెచ్వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం పునరుద్దరణ చేసారు. ఉచిత వసతిని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని సీఎంను కోరింది ఏపీ సచివాలయ సంఘం. అయితే ఆ సచివాలయ సంఘం విజ్ఞప్తిని అంగీకరించారు సీఎం జగన్. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతిని కొనసాగిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. అయితే ఉద్యోగులకు ఉచిత వసతిని ఎత్తేస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కానీ ఈ సీఎం ఆదేశాలతో సచివాలయ, హెచ్వోడీల్లో పని చేసే ఉద్యోగులకు ఊరట లభించింది. దీని పై ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి స్పందిస్తూ… సీఎం జగన్ పెద్ద మనస్సుతో మా విజ్ఞప్తిని మన్నించారు. ఆర్ధిక కష్టాల్లో ఉన్నా ఉద్యోగుల సంక్షేమం గురించే సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అని పేర్కొన్నారు.