మావోయిస్టు అగ్ర నేతలు ఒక్కొక్కరు కన్నుమూస్తున్నారు.. మరికొందరు అనారోగ్య సమస్యలతో జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.. తాజాగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే అనారోగ్య సమస్యలతో.. అది కూడా సరైన మందులు, వైద్యం అందకి కన్నుమూయడం చర్చగా మారింది.. దండకారణ్యంలో గత రెండేళ్లలో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారన్నారు దంతేవాడ పోలీసులు. రామన్న, హరిభూషణ్, రామకృష్ణలు తీవ్ర అనారోగ్యంతో బారినపడి.. తుదకు ప్రాణాలు విడిచారన్నారు. వరుసగా అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతుండడం చూస్తుంటే.. మావోయిస్టు పార్టీ తుదిదశకు చేరుకున్నట్లుకనిపిస్తోందన్నారు. సీనియర్ నేతలు అనారోగ్యంతో బాధపడుతుంటే.. వారికి మెడిసిన్స్ కూడా సప్లై చేయలేని విధంగా, మావోయిస్టుల కొరియర్ వ్యవస్థ బలహీనపడిందన్నారు. ఈ పరిస్థితిపై మావోయిస్టు అధినాయకత్వం. పునరాలోచన చేయాల్సిన సమయమన్నారు దంతేవాడ ఎస్పీ. కాగా, ఆయనకు వైద్య సహాయం అందించిఉంటే బతికేవారని.. ఇది ప్రభుత్వం చేసిన హత్యే నంటూ ఆర్కే భార్య ఆరోపించిన సంగతి తెలిసిందే.

By admin

Leave a Reply

Your email address will not be published.