మా ఎన్నికలు అయిపోయి వారం రోజులు అవుతుంది కానీ ఇప్పటికీ దాని వేడి మాత్రం చల్లారడం లేదు. గెలిచిన మంచు విష్ణు హాయిగా ప్రమాణ స్వీకారం చేసి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతో పాటు రాజకీయ నాయకులను కూడా కలుస్తున్నాడు. మా అధ్యక్షుడిగా ఇండస్ట్రీకి ఏం మేలు చేయాలా అంటూ తిరుగుతున్నాడని మోహన్ బాబు చెప్తున్నాడు. తన వారసుడు అనుకున్నది చేసి చూపిస్తాడని ధీమాగా చెప్తున్నాడు కలెక్షన్ కింగ్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమకు బాగా కావాల్సిన వాళ్లని.. ఇండస్ట్రీ సమస్యల గురించి చెప్పి ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా తీసుకొస్తామని చెప్తున్నాడు మంచు విష్ణు. మరోవైపు మా అసోసియేషన్‌లో ఉన్న గొడవల గురించి మాత్రం పెద్దగా మాట్లాడటం లేదు విష్ణు. గెలిచిన తర్వాత కేవలం పనులపై ఫోకస్ చేయాలి కానీ అనవసరమైన విషయాలపై కాదంటున్నాడు ఈయన. తాజాగా ఈయన అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.