హైదరాబాద్‌ : రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొంది. వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వరంగల్‌, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్‌, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షలు కురుస్తాయని తెలిపింది. శనివారం హైదరాబాద్‌తో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.