ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈమేరకు ప్రధాన పార్టీలన్నీ సైతం వైసీపీని ఎదుర్కొనేందుకు ధీటుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే వీటిన్నింటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి డోంట్ కేర్ అంటున్నట్లుగా ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వాటిని తిప్పికొట్టేందుకు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు ఇప్పటికే పీకే టీం రంగంలోకి దిగి పనులు మొదలుపెట్టినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. త్వరలోనే మరోసారి క్యాబినెట్ విస్తరణ చేపట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికలకు ఈ టీముతోనే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో క్యాబినెట్లో ఎవరెవరు చోటు దక్కించుకుంటారనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది. ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను తిప్పికొట్టేలా ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ప్రతిపక్ష టీడీపీ ఏపీలోని ప్రధాన కులాలపై ఫోకస్ పెట్టడంతో వారిని తమవైపుకు తిప్పుకునేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని వైసీపీలో టాక్ విన్పిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.