హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే యావత్ తెలంగాణ ప్రజల దృష్టి నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఇప్పటికే ఓసారి సర్వే నిర్వహించిన అధికార పార్టీ మరోసారి సర్వే చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గులాబీ బాస్ ఆదేశాలతో సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గాలు మరోసారి రంగంలోకి దిగి రీ సర్వే చేపడుతున్నాయి. ఈ నివేదిక ఆధారంగానే గులాబీ బాస్ పర్యటన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉండనుందనే టాక్ విన్పిస్తోంది.

హుజూరాబాద్ లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే నెలకొంది. ఈ ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా మారడంతో ఇరుపార్టీలు నువ్వా.. నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటం ఈ రెండు పార్టీల అభ్యర్థులకు కలిసి రానుంది. అదే సమయంలో ఇరు ప్రభుత్వాలపై ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత ఉందని స్పష్టమవుతోంది. ఈ ఉప ఎన్నిక ఏ ప్రభుత్వంపై ఎక్కువ వ్యతిరేకత ఉందో తేల్చే అవకాశం సైతం కన్పిస్తోంది. ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య కొద్దిరోజులుగా మాటలయుద్ధం నడుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.