అమరావతి: ఏపీలో విద్యుత్‌ కోతలు ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఇంధన శాఖ స్పందించింది. అదంతా దుష్ప్రచారమేనని స్పష్టంచేసింది. దసరా తర్వాత కరెంటు కోతలు ఉంటాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. లోడ్‌ రిలీఫ్‌ పేరుతో గంటల కొద్దీ విద్యుత్‌ కోతలు విధిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని స్పష్టంచేసింది.

బొగ్గు నిల్వ, సరఫరా అంశాలు విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తెలిపింది. సంక్షోభంలోనూ నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చేందుకు డిస్కంలు కృషిచేస్తున్నాయంది. డిస్కంలు ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్‌ ఇస్తున్నాయని, విద్యుత్‌ సంక్షోభ నివారణకు అత్యవసర ప్రణాళిక అమలు చేస్తున్నట్టు తెలిపింది. బొగ్గు కొనుగోలు కోసం జెన్‌కోకు రూ.250 కోట్ల నిధులు ఇచ్చినట్టు పేర్కొంది. బొగ్గు ఎక్కడ దొరికినా కొనాలని జెన్‌కోను ఆదేశించామని ఇంధనశాఖ వెల్లడించింది. రాష్ట్రానికి రోజుకు అదనంగా 8 బొగ్గు రైళ్లు కేటాయించారని తెలిపింది.

By admin

Leave a Reply

Your email address will not be published.