హైదరాబాద్ : తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తన భర్తను హత్య చేసింది. అనంతరం అతను గుండె పోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది. కానీ చివరికి అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్ట్ 20న దీప్తి పటేల్ అనే మహిళ 108కు కాల్ చేసి తన భర్త బిపిన్‌చంద్ర పటేల్‌కు తీవ్ర గుండెపోటు వచ్చిందని తెలిపింది. దాంతో బిపిన్‌చంద్రను ఎల్‌జీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దాంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే బిపిన్‌చంద్రను హత్య చేశారని పోలీసులకు సమాచారం అందడంతో దీప్తిని, ఆమె ప్రియడు సుతార్‌లను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో వారు నేరాన్ని ఒప్పుకున్నారు. తమ మధ్య వివాహేతర సంబంధం ఉందని, అది బిపిన్‌చంద్ర కు తెలిసి అడ్డుచెప్పడంతో అతడిని హత్య చేశామని వారు పోలీసులకు తెలిపారు. అనంతరం భర్తకు పాలల్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చానని ఆపై ప్రియుడు సహకారంతో గొంతు పిసికి ఊపిరిఆడకుండా చేశానని నిందితురాలు దీప్తి పటేల్ తెలిపింది. ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.