న్యూఢిల్లీ : పార్టీలోని అసమ్మతి వాదులకు చెక్‌పెట్టేందుకు.. అధ్యక్ష ఎన్నికను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధ్యక్ష ఎన్నికతో పాటు నూతన ఆఫీస్ బేరర్లతో కూడిన టీమ్‌ను కూడా ఎన్నుకోనుంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తానే పూర్తి స్థాయి కాంగ్రెస్ అధ్యక్షురాలినని …తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ చెప్పినప్పటికీ.. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు సమాచారం. పార్టీ పునరుజ్జీవనం కోరుకుంటుందని, అయితే ఐక్యత, ప్రయోజనాలను దెబ్బతినకుండా చూడటం కూడా అంతే ఆవశ్యమని సోనియా గాంధీ సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన బాధ్యతలను వ్యవస్థాగత ప్రధాన కార్యదర్శి కెకె వేణుగోపాల్‌కు అప్పగించారని వార్తలస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది పలు రాష్ట్రాల అసెంబీ ్లఎన్నికలకు ముందు పార్టీ సభ్యత్వానికి సంబంధించిన డ్రైవ్‌తో సహా పలు కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ను సిడబ్ల్యుసి ఆమోదించాల్సి ఉంది. 2019లో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని వీడిన నాటి నుండి తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా.. సభ్యత్వానికి సంబంధించిన డ్రైవ్, పార్టీ అంతర్గత ఎన్నికలు జరిగేంత వరకు కొనసాగుతారని సమాచారం.