హైదరాబాద్‌: మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదని సినీ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణుతో సహా ఆయన ప్యానెల్‌ సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ‘మా’ బయట ఉండి తాము విష్ణు చేసే పనులకు మద్దతు ఇస్తూనే, ప్రతి నెలా రిపోర్ట్‌ కార్డు అడుగుతామని గతంలో ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ‘మా’ మసకబారిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలకూ నరేశ్‌ ఈ సందర్భంగా కౌంటర్‌ ఇచ్చారు.

”పోటీలో గెలిచిన వాళ్లందరికీ శుభాకాంక్షలు. ‘మంచు కమిటీ.. మంచి కమిటి’. ఎందుకంటే ఈ కమిటీలో అనుభవం కలిగిన వాళ్లు, యువత, మహిళలు ఉన్నారు. అవకాశాల కోసం పోరాడతామని చెప్పారు. మంచి మేనిఫెస్టోతో వచ్చారు. అదే మన పనికి అద్దం పడుతుంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ అయిపోయిందేదో అయిపోయింది. భవిష్యత్‌ కోసం పనిచేద్దాం. ‘మా’ మెరుగు పడాలని ఆరేళ్లు పోరాటం చేశా. ‘మా’ సభ్యులకు అన్ని రకాల సహాయం చేశా. ‘మా’ ఏ ఒక్కరి సొత్తు కాదు. ‘మా’ చిన్నదా? పెద్దదా అనేది కూడా విషయం కాదు. ఎందుకంటే కోహినూరు వజ్రం చిన్నదే. కానీ, అది వజ్రమే. ఈ కమిటీ కచ్చితంగా అద్భుతాలను సాధిస్తుందని నమ్ముతున్నాం. ‘మా’ మెరుగు పడింది. మరింత ముందుకు తీసుకెళ్తాం. ఈ క్షణం నుంచి ‘మంచి మాత్రమే మైకులో మాట్లాడదాం. చెడు చెవిలో చెప్పుకుందాం”

 

By admin

Leave a Reply

Your email address will not be published.