వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఆదివారం డిండి మండలం శేషాయికుంటలో వివేకనంద విగ్రహం ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు కేవలం హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే కాకుండా.. రాష్ట్రం మొత్తం అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస పాలనతో ఏడేళ్ల నుంచి సామాన్యుల జీవితాలు చతికలపడ్డాయని వివరించారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని కోరారు. యువత వివేకనంద ఆశయసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి, సర్పంచి అలివేలు, నాయకులు కిషన్‌నాయక్‌, నల్లవెల్లి రాజేష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, శ్రావణ్‌రెడ్డి, శ్రీను, కుర్మారెడ్డి, వెంకటరమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.