కరోనా కొట్టిన దెబ్బ చిత్ర పరిశ్రమకు చాలా బలంగా తగిలింది. ఆ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకున్నాయి. కొన్ని చోట్ల ఇంకా లేదు. భారతీయ చిత్ర పరిశ్రమకు కీలకంగా నిలిచే మహారాష్ట్రలో ఈ నెల 22 తర్వాత థియేటర్లు తెరచుకోనుండటంతో సినిమాలు వరస కడుతున్నాయి. ఈ నెలాఖరుకి సుమారు అన్నిచోట్లా థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నాలుగు నెలల కాలంలో వంద సినిమాలకు పైగా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఒకప్పటి వైభవంతో కొత్తకాంతులు విరజిమ్ముతుందని అందరి నమ్మకం. ఆ దిశగానే హిందీ చిత్రసీమతో పాటు ఇతర భాషా సినీ పరిశ్రమలూ వేగంగా అడుగులు వేస్తున్నాయి.

కరోనా రాకముందు అంటే 2019లో భారతీయ చిత్ర పరిశ్రమకు కాసుల పంట పండింది. అన్ని భాషల్లోనూ కలిసి సుమారు రూ.10,000 కోట్లు ఆ ఏడాదిలో వచ్చాయి. వచ్చే ఏడాది కచ్చితంగా అలాంటి భారీ మొత్తాన్ని చిత్రసీమ చూస్తుందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.