Yuvraj Singh: మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ను హరియాణా పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది జరిగిన లైవ్ చాట్‌లో ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో యువరాజ్‌ను అరెస్ట్‌ చేశారు. గతేడాది రోహిత్‌ శర్మ తో జరిగిన లైవ్‌ చాటింగ్‌లో క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఈ ఫిబ్రవరిలో హరియాణాలోని హన్సి నగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నిన్న యువీని హిస్సార్‌ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్‌ అయిన కాసేపటికి యువీ విడుదలయ్యాడు. గతంలోనే ఈ విషయంపై యువీ క్షమాపణలు చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.