ముంచంగిపుట్టు : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్‌ వినియోగాన్ని సైతం నివారించగలిగితే అందరికీ సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని స్వచ్ఛభారత్‌ నెహ్రూ యువ కేంద్రం (ఎన్‌వైకె) వాలంటీర్‌ వెంగడ జగన్‌ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోగల నాలుగు రోడ్ల కూడలిలో క్లీన్‌ ఇండియా గ్రామ స్థాయి కార్యక్రమం నిర్వహించారు. క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌, మన భారత్‌ అంటూ నినాదాలు చేశారు. స్థానిక పారిశుధ్య కార్మికులతో ప్లాస్టిక్‌ వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే దుష్ఫలితాలు, నష్టాలుపై ప్రజలకు అవగాహన కల్పించారు

By admin

Leave a Reply

Your email address will not be published.