హైదరాబాద్ఖ: లక్షలాది మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి తెలంగాణలో ఇంత నిర్బంధం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఇది తాలిబన్ రాజ్యం కాదు కదా? అని ప్రశ్నించారు. అమరుడికి నివాళులు అర్పిస్తామంటే నొప్పేంటి? అని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి కసబ్ కాదు కదా?, తాను వెళ్లడానికి ఎస్కార్ట్ ఇవ్వండన్నారు. ఇంటి దగ్గర రోడ్డుపై రేవంత్ బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.