ప్రయాణికులు పోగొట్టుకున్న విలువైన వస్తువులు, నగదును ఆయా యజమానులకు ఆర్పిఎఫ్ పోలీసులు అప్పగించారు. ఈ నెల 16న విశాఖపట్నం రైల్వేస్టేషన్లో 02644 పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ఎ 1లో కోచ్‌లో రూ.1,05,000 విలువైన బంగారు ఆభరణాలు, బట్టలు నగదుతో కూడిన ట్రాలీ బ్యాగ్ ఆర్పిఎఫ్ బృందం గుర్తించింది. విచారణ అనంతరం విజయనగరం నివాసి అయిన ప్రయాణికులు సాలగ్రా రమణమణికి అప్పగించారు. మరొక సంఘటనలో దువ్వాడ రైల్వే స్టేషన్లో 02886 కృష్ణరాజపురం- భువనేశ్వ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ బి 13 కోచ్‌లో రూ.1,30,000 విలువైన రెండు ల్యాప్‌టాప్‌లు ఉన్న బ్యాగ్‌ను ఆర్పిఎఫ్ బృందం గుర్తించింది. విచారణ అనంతరం రాజమండ్రి నివాసి అయిన ఎం.శివదుర్యకు వాటిని అప్పగించారు. ఈ సందర్భంగా ఆర్పిఎఫ్ సిబ్బందిని డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ సత్పతి అభినందించారు.