Month: March 2022

31 నుంచి టీటీడీలో కరెంట్‌ బుకింగ్‌

► నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం  తిరుమలలోని కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ► రెండు అక్నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌లు వస్తాయి. ఒక స్లిప్‌ యాత్రికునికి ఇస్తారు.…

చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ…

ఉపాధి పనిదినాలను 26 కోట్లకు పెంచండి

ఉపాధిహామీ పథకం (నరేగా)లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పనిదినాలను 26 కోట్లకు పెంచాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీపీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డిల నేతృత్వంలో పార్టీ…

‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’లు సిద్ధం

వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు కనీసం 19 నుంచి 40 వాహనాలు..…

రూల్‌ ప్రకారమే రుణాలు

రాజ్యాంగానికి, నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని, ఎక్కడా వాటిని ఉల్లంఘించలేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ స్పష్టం చేశారు. వేస్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌ డ్రాఫ్ట్‌కు ఆర్బీఐ నిబంధనల మేరకే ప్రభుత్వం వెళ్లిందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా…

విద్యుత్‌ చార్జీలు స్వల్పంగా పెంపు

ఇటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూనే అటు డిస్కమ్‌లకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 2022–23 రిటైల్‌ విద్యుత్‌ సరఫరా ధరలను సవరించి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి కొత్త చార్జీలను ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న కేటగిరీల స్థానంలో కొత్తగా ఒకే గ్రూపు కింద…

ముహూర్తం 4న

రాష్ట్రంలో నూతన జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 4వ తేదీన ఉదయం 9:05 నుంచి 9:45 గంటల మధ్య 13 కొత్త జిల్లాల అవతరణ ముహూర్తానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కొత్త జిల్లాల కార్యకలాపాలను సీఎం…

ఏప్రిల్‌ 1న వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ప్రారంభం

ఏప్రిల్‌ 1న వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో 500 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. గర్భిణులు, బాలింతలకు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వాహనాలకు…

హైదరాబాద్‌ డాక్టర్‌కు బ్రిటిష్‌ అత్యున్నత అవార్డు

బ్రిటిష్‌ రెండో అత్యున్నత ర్యాంకింగ్‌ అవార్డు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌–2021’ను ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్‌ పి.రఘురామ్‌ అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన…

మరో 40 కరోనా కేసులు

రాష్ట్రంలో బుధవారం 19,052 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 40 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.91లక్షలకు చేరింది. తాజాగా 35 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తంగా 7.86లక్షల మంది కరోనా నుంచి…