Month: November 2022

భైంసా అల్లర్ల బాధితులతో బండిసంజయ్ భేటీ

నిర్మల్: భైంసా అల్లర్ల బాధితులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay kumar) భేటీ అయ్యారు. అల్లర్లలో సర్వస్వం కోల్పోయిన 30 మంది బాధిత కుటుంబాలను సంజయ్ ఓదార్చారు. తమపైనే దాడి చేసి, పీడీ యాక్ట్ కేసులు పెట్టి…

జగన్.. రాయలసీమ ద్రోహి

అమరావతి: ముఖ్యమంత్రి జగన్(Cm jagan) సీమ వాసిగా ఉంటూ రాయలసీమకు పదే పదే మోసం చేయడం శోచనీయమని ఏపీ పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి(Tulsi Reddy) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని జగన్, ఆయన పార్టీ వారు…

వివేకా కేసు బదిలీపై చంద్రబాబు ఏమన్నారంటే…

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda reddy) హత్య కేసును సుప్రీంకోర్టు (Supreme court) తెలంగాణ (Telangana)కు బదిలీ చేస్తూ ఆదేశాలివ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘‘సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీతో జగన్మోహన్…

నరేగా నిధులపై పిటిషన్‌‌లు కొట్టేసిన ఏపీ హైకోర్టు

అమరావతి: నరేగా నిధులపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌లను హైకోర్టు (AP Highcourt) కొట్టివేసింది. మంగళవారం 102 రివ్యూ పిటిషన్‌లను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నరేగా బిల్లులు చెల్లించాలని కోర్టును ఆశ్రయించగా, పిటషనర్‌లకు అనుకూలంగా గతంలో ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం…

కారు దిగేందుకు నిరాకరణ.. క్రేన్‌తో లిఫ్ట్‌ చేసి స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్‌తో ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో…

తెలంగాణలో ఎన్నికలు జాతకాలతో నడుస్తున్నాయంటూ రాజా సింగ్ కేసు విచారణలో సుప్రీం ఎద్దేవా

న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల(Telangana election)పై సుప్రీం కోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానిoచింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అనర్హుడిగా ప్రకటించే అంశంపై నోటీసులు జారీ చేయాలంటూ టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్…

ధర్మపురి అరవింద్ పిటిషన్‌పై ముగిసిన విచారణ

Hyderabad : ధర్మపురి అరవింద్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ పూర్తైంది. ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తీరుపై ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం తరచూ జరిగేదేనని హైకోర్టు పేర్కొంది. ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం…

నీ మాట‌లు తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా.. లోకయ్యా!

విశాఖ‌: నెల్లూరుపై పదే పదే నోరు పారేసుకుంటే తెలుగువారందరినీ అవమానించినట్టేనయ్యా, లోకయ్యా! అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ నేత నారా లోకేష్‌కు చుర‌క‌లంటించారు. నెల్లూరును రాష్ట్ర నేర రాజ‌ధానిగా నారా లోకేష్ అభివ‌ర్ణించ‌డాన్ని విజ‌య‌సాయిరెడ్డి…

గెలుపే లక్ష్యంగా.. వ్యూహాలకు పదును

వైయ‌స్ఆర్ జిల్లా : 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలకు పదును పెడుంతోంది. ఈ మేరకు ఏడాదిన్నర ముందే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్నవారిని ఎంపిక…

అభివృద్ధి వికేంద్రీకరణపై స్పష్టమైన తీర్పు వచ్చింది

శ్రీకాకుళం: అభివృద్ధి వికేంద్రీకరణపై గౌరవ సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చిందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శాసనసభ చట్టాలు చేయవద్దంటే ఎలా..? ఏ వ్యవస్థ కూడా పరిధి దాటకూడదని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా…