ఆంధ్రప్రదేశ్

  • ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణ కేసు సుమోటోగా విచారణ
    ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణ కేసు సుమోటోగా విచారణ

    అమరావతి: హైకోర్టుల అనుమతి లేకుండా ఎంపీ, ఎమ్మెల్యే తదితర ప్రజా ప్రతినిధులపై కేసులు ఎత్తివేయరాదంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను ప్రభుత్వం ఉపసంహరించడంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కేసుల ఉపసంహరణ నిమిత్తం దాఖలైన పిటిషన్ల వివరాలను అందజేయాలని విజయవాడలోని ప్రజా ప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్‌ అధికారిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 23కి వాయిదా వేసింది.

క్రైమ్

  • గచ్చిబౌలి: ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య
    గచ్చిబౌలి: ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య

    గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో.. ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన ఆర్మీ రిటైర్డ్‌ అధికారి సుకుమార్‌ జితేందర్‌నాథ్‌ మండల్‌ పెద్ద కూతురు శతాబ్ధి మండల్‌(32) కొంత కాలం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసి ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేస్తోంది. 2020 ఆగస్టులో గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. షేరింగ్‌ ఫ్లాట్‌లో ఉండే డాక్టర్‌ ప్రియాంక రెడ్డి, గీత మాధురిలు నవంబర్‌ 28న బయటకు వెళ్లారు. తిరిగి 30న మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. ఫ్లాట్‌లోకి రాగానే దుర్వాసన రావడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.