తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జర్నలిస్టులే పెద్ద ఆస్తి. సినిమా జర్నలిస్టులకు చేయూత ఇచ్చేందుకు ప్రతి నిర్మాత కనీసం ఒక లక్ష రూపాయలు జర్నలిజం ఫండ్ కింద పెడితే బాగుంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్’(టీఎఫ్జేఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు.