ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఖతీజా పాత్రలో నటించానని చెప్పిన సమంత ప్రతి ఒక్కరు వారి జీవితంలో కాస్త విరామం ఇచ్చి ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోమని కోరింది. ఇక ఈ సినిమాలో తనకు ‘డిప్పం డిప్పం’ పాట అంటే ఎంతో ఇష్టమని సమంత ఈ సందర్భంగా పేర్కొంది. నయనతార గురించి చెబుతూ..తాను కలిసిన వాళ్లలో మోస్ట్ హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్ న‌యన‌తార అని ఆమెలాంటి వ్యక్తి మరొకరు ఉండరు అని పేర్కొంది.

ఇక ఓ నెటిజన్‌ ఒకే సమయంలో ప్రేక్షకుల నుంచి ప్రేమ, విపరీతమైన ద్వేషం రావడం ఎలా అనిపిస్తుంది అని అడగ్గా.. ఆ రెండింటికి దూరంగా ఉంటానని, అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతఙ్ఞతతో ఉంటానని సామ్‌ చెప్పుకొచ్చింది. దీంతో ప్రేమ‌పై కూడా త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ఈ సమాధానం ద్వారా సమంత చెప్ప‌క‌నే చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.