సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలో వరుస అప్డేట్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన రాగా.. కళావతి, ఎవ్రీ పెన్నీ పాటలు అత్యధిక వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేశాయి.