మ్యాట్రిమోని ద్వారా ప్రకటనలు ఇస్తూ మహిళలను పరిచయం చేసుకుని ఒకరికి తెలియకుండా మరొక్కరిని ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకుని మరో మహిళను మోసం చేసిన అప్పలరాజు అలియాస్ విజయ్ బాగోతం తాజాగా బయటపడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం… దమ్మాయిగూడలోని అయోధ్యనగర్ కాలనీలో నివాసముంటున్న అప్పలరాజు అలి యాస్ విజయ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి సంతానం కలగలేదు.