ఎచ్చెర్ల క్యాంపస్‌: హైస్కూల్‌ పిల్లల నుంచి మధ్య తరగతి ఇంటి యజమానుల వరకు, బాలికల దగ్గర నుంచి తల్లుల వరకు అందరూ ఈ భూతానికి బాధితులే. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న వారి జాబితా పరిశీలిస్తే.. ఆడ, మగ బేధం లేకుండా అందరి చావు కేకలు వినిపిస్తాయి. అందరి మరణాల వెనుక కారణాలు వేరైనా వారిని ఉసిగొల్పిన మానసిక భావన మాత్రం ‘క్షణికావేశం’. దీన్ని అధిగమించగలిగితే బతుకులు బాగు పడతాయని వైద్య నిపుణులు, మానసిక వేత్తలు సూచిస్తున్నారు.

వీరంతా బతకాల్సిన వారే..
►జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు పరిశీలిస్తే.. అందరి సమస్యలకు పరిష్కారం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ నిజాన్ని వారే తెలుసుకోలేకపోయారు. కుటుంబంతో కలిసి హాయిగా జీవించేందుకు అన్ని అవకాశాలు, అర్హతలు ఉన్నా చావు దారిని ఎంచుకున్నారు. ఎచ్చెర్ల అంబేడ్కర్‌ గురుకులంలో ఓ విద్యార్థిని చిన్న వ్యక్తిగత కారణంతో ఉరి వేసుకుని చనిపోయింది. కుమార్తెపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు వేదన మాత్రమే మిగిలింది.

By admin

Leave a Reply

Your email address will not be published.