మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నేరగాళ్లు లెక్కచేయడం లేదు. ఏకంగా ఫోన్లో గంజాయి ఆర్డర్ తీసుకొని.. ఎంచక్కా ర్యాపిడో బైక్ బుకింగ్ చేసుకొని ఇంటికెళ్లి మరీ సరుకు డెలివరీ చేస్తున్నాడు. ఇప్పటికే రెండుసార్లు రాచకొండ పోలీసులకు చిక్కిన మురుగేశన్ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. తాజాగా మూడోసారి మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులకు చిక్కాడు. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన మురుగేశన్ కాప్రాలోని శంకరమ్మ కాలనీలో స్థిరపడ్డాడు. ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.