న్యూడిల్లీ: జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు విచారణను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై తామే విచారణ చేపడతామని తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. దీనిపై విచారణ చేపట్టనుంది. వారణాసి విచారణపై స్టే ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. సర్వే నివేదికలోని అంశాలను బయటపెట్టొద్దని స్పష్టంచేసింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకూ జ్ఞానవాపి మసీదులో సర్వే జరిగింది. సర్వే సందర్భంగా మసీదులో శివలింగం బయటపడినట్టు హిందూవర్గం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

By admin

Leave a Reply

Your email address will not be published.