కోవిడ్‌ అనంతరం ఆర్టీసీ లాభాల బాట పడుతోంది. జిల్లాలోని నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపోలు సీజన్‌ వారీగా అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో చౌకగా రవాణా సదుపాయం కల్పిస్తూ సంస్థ ఉన్నతికి దోహదపడుతున్నాయి. పెళ్లిళ్లకు బస్సుల అద్దెపై ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. వివాహాలకు బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

సెక్యూరిటీ డిపాజిట్‌ రద్దు…
పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేందుకు సంస్థ టార్గెట్‌ పెట్టుకుంది. పెళ్లి వారిని ఆకట్టుకునేందుకు సెక్యూరిటీ డిపాజిట్‌ను రద్దు చేసింది. గతంలో మొత్తం చార్జీలో 20శాతం అ డ్వాన్స్‌ చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ డిపాజిట్‌ను రద్దు చేయడంతో ప్రజలు ప్రైవేట్‌ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరకు రావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్టీసీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.