న్యూఢిల్లీ: 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ గ్రాంట్ల కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,939 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.969 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సహాయమంత్రి కె.ఎం.పాటిల్‌ చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. గత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ గ్రాంట్ల కింద ఏపీకి కేటాయించిన రూ.2,625 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు.

వరద సాయంగా రూ.895 కోట్లు ముందే ఇచ్చాం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన సంభవించిన పంట, ఆస్తి నష్టానికి సంబంధించి రూ.895 కోట్లను రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నిధికి కేంద్ర ప్రభుత్వ వాటాగా ముందస్తుగానే విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. గత నవంబర్‌లో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం జరిగినట్లుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.