సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న సుమారు 600 ప్రభుత్వ నివాసాలు క్రమేణా భూత్‌ బంళాలుగా మారిపోతున్నాయి. రాత్రి సమయాల్లో ఇవి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. అల్లరి చిల్లరి మూకలు నిరుపయోగంగా ఉంటున్న ఈ ప్రభుత్వ భవన సముదాయాల్లో సృష్టిస్తున్న అలజడులు పరిసర ప్రాంతాలవారికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.
►వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సిబ్బందితో దశాబ్దాలపాటు ఈ ప్రాంతం సందడిగా కనిపించిన ఈ భవన సముదాయాలు
కొద్ది సంవత్సరాలుగా అనర్థాలను తెచ్చి పెడుతున్నాయి.
►ప్రస్తుతం మొండిగోడలకే పరిమితమైన ప్రభుత్వ భవనాల సముదాయాలతో రాత్రి వేళల్లో రహదారుల మీదుగా ప్రయాణించేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.