న్యూఢిల్లీ: యుద్ధక్షేత్రాల్లో సైనిక బలగాలకు మరింత తేలికైన, మన్నికైన యూనిఫాం సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తయారుచేశారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్‌ కోసం ఎంపికచేశారు.

బలగాలను కాస్త దూరం నుంచి చూస్తే పసిగట్టకుండా ఉండేందుకు ఆయా రంగుల్లో డిజైన్‌ను ఎంపికచేశారు. ఆలివ్, మృణ్మయ రంగుల కలబోతగా ‘డిజిటల్‌ డిస్ట్రర్బ్‌’ డిజైన్‌లో ఈ యూనిఫామ్‌ను రూపొందించారు. వచ్చే ఏడాది జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనికులకు యుద్ధక్షేత్రాల్లో వినియోగిస్తున్న వేర్వేరు డిజైన్‌ల ఆర్మీ యూనిఫామ్‌లను పరిశీలించి, పలు చర్చల అనంతరం ఈ యూనిఫామ్‌కు తుదిరూపునిచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.