న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహించడం ఏ వ్యక్తికి దైవదత్తంగా సంక్రమించే హక్కు కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. గత పదేళ్ల కాలంలో 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిన ఒక పార్టీకి నేతృత్వం వహించే హక్కు దానంతట అదే రాదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ యూపీఏ కూటమి లేదంటూ కామెంట్లు చేసిన మర్నాడు గురువారం రాహుల్‌గాంధీపై ప్రశాంత్‌ కిశోర్‌ ట్విట్టర్‌ వేదికగా మాటల దాడికి దిగారు. దేశ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక స్థానం ఉందని, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిపక్ష కూటమికి సారథి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.