హెటిరో యాజమాన్యం దిగి వచ్చే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని మత్స్యకార నాయకులు స్పష్టం చేశారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ నుండి వ్యర్థ జలాలను సముద్రంలోకి సరఫరా చేసే పైప్‌లైన్‌ పనులను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మత్స్యకారులు చేపట్టిన శాంతియుత మహాధర్నా గురువారం రెండవ రోజు కూడా కొనసాగింది. రాజయ్యపేట-దొండవాక గ్రామాల మధ్య సముద్రంలోకి హెటిరో పరిశ్రమ పైపులైన్‌ ఏర్పాటు చేయు స్థలం వద్ద హెటిరో పైపులైన్‌ పనులు నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. జడ్పిటిసి సభ్యురాలు గోసల కాసులమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, మత్స్యకారుల జేఏసీ రాష్ట్ర నాయకులు కంబాల అమ్మోరయ్య, మత్స్యకార నాయకులు పిక్కి కామేశ్వరరావు, పిక్కి స్వామి, మేరిగి కొర్లయ్య, నూకరాజు తదితరులు మాట్లాడారు. సముద్రం లోకి పైపులైను ఏర్పాటు చేసి వ్యర్థాలను విడుదల చేసి మత్స్యకారుల పొట్టలు కొట్టొద్దన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.