హైదరాబాద్‌: విద్యుత్‌ టారీఫ్‌ (చార్జీల పెంపు) ప్రతిపాదనలను 7 రోజుల్లోగా సమర్పించా లని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆదేశించింది. నవంబర్‌ 30న డిస్కంలు సమర్పించిన 2022–23 ఆర్థిక సంవత్సరాల వార్షికాదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌)ల్లో టారీఫ్‌ ప్రతిపాదనలు లేవని, వీటిని సమర్పించినట్లు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు డిస్కంల సీఎండీలకు ఈఆర్సీ గురువారం లేఖ రాసింది. వచ్చే ఆర్థిక సంవత్సరాని(2022–23)కి సంబంధించిన టారిఫ్‌ ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించిన నాటి నుంచి 120 రోజుల తర్వాతే రాష్ట్రంలో చార్జీల పెంపునకు అనుమతిస్తామని ఈఆర్సీ స్పష్టం చేసింది. దీంతో డిస్కంలకు ఎదురు దెబ్బతగిలింది. ప్రతిపాదనలు ఎంత ఆలస్యం చేస్తే చార్జీల పెంపులో అంత ఆలస్యం జరగనుంది. గడువులోగా టారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించకపోతే ఏఆర్‌ఆర్‌లను ఈఆర్సీ తిరస్కరించే అవకాశాలున్నట్లు తెలిసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.