జవాద్ తుపాన్ కారణంగా ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాన్ ప్రభావానికి కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోగా.. కొన్ని చోట్ల చెట్లకొమ్మలు పడి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు నేలకూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యుత్ శాఖ సూచించింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(APEPDCL) వినియోగదారులకు ఓ విజ్ఞప్తి చేసింది. జవాద్ తుఫాన్ వల్ల ఏర్పడే విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలకు సంబందించిన సమాచారాన్ని ఏపిఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియచేయాలని కోరింది.

By admin

Leave a Reply

Your email address will not be published.