ప్రధాని మోడీ(PM Modi)కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) లేఖ రాశారు. ఐఏఎస్(IAS)ల నిబంధనల సవరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్(CM KCR writes a letter to Prime Minister Modi). కేంద్ర ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల హక్కులను హరిస్తాయన్నాయని అభిప్రాయ పడ్డారు. నిబంధనల సవరణలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఉన్నాయని ఆందోలన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఈ సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. రాష్ట్రాల అనుమతి లేకుండా అధికారులు కేంద్ర సర్వీసులకు తీసుకోవడం ఏకపక్ష నిర్ణయమన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమన్నారు.