తెలంగాణలో కోవిడ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. పండుగ ముగిసిన వెంటనే కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3,980 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,38,795 కాగా, మరణాల సంఖ్య 4,075గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 7,01,047 ఉండగా, తాజాగా 2,398 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.89 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 33,673 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

By admin

Leave a Reply

Your email address will not be published.