2021-22 ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు (ITR Filing)చేయడానికి చివరి తేదీ మార్చి31, 2022. అయితే 2021 డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును మార్చి 31 వరకు పెంచింది ఆదాయపు పన్ను (Income Tax) శాఖ. గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. గడువు తర్వాత ఐటీఆర్ (ITR) దాఖలు చేసినట్లయితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే జరిమానా (Penalty) లేదా కనీసం మూడు సంవత్సరాల పాటు జైలు (Jail) శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.