ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగులకు ( Government Employees) రాష్ట్ర ప్రభుత్వం (AP Government) శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakirshna Reddy) తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎంఓ అధికారులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ(PRC), హెల్త్ కార్డులు (Health Cards), హెల్త్ ఫీజుల రీయింబర్స్ మెంట్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న ఆయన.. ఈ నెలాఖరుకు పీఆర్సీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల భద్రత విషయంలో సీఎం జగన్ రెండడుగులు ముందే ఉంటారని సజ్జల అన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *