జిల్లా వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మండలంలోని పెంటకోట గ్రామంలో వైసిపి పాయకరావు పేట పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి.వెంకట సత్యవతి దంపతులు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రామారావును శాలువాతో సత్కరించారు. పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో మండల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు రాజేష్ కన్నా, దగ్గుపల్లి సాయిబాబా, ఆడారి నూకరాజు, రామాల శ్రీను, సత్యనారాయణ, సత్య కిరణ్, కె.కోటేశ్వరరావు, చిక్కాల బాబు, కొంతం నరేష్ తదితరులు పాల్గొన్నారు.