విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 244వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌ -1 విభాగ కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధులు వైటి దాస్‌, కె.సత్యనారాయణ రావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్త రౌండ్‌ టేబుల్‌ సమావేశాల ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టి, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన పరిశ్రమలు ప్రయివేటు సంస్థల ఆధీనంలోకి మారితే ప్రజల జీవన ప్రమాణాలు, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటాయన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *