ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర బిజెపి మంత్రి కుమారుడు దాష్టీకానికి బలైన రైతు అమరవీరులకు నివాళులర్పిస్తూ జివిఎంసి జోన్‌ -2 కార్యాలయం అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యాన కాగడాల ప్రదర్శన నిర్వహించారు. బిజెపి మారణకాండను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు ఉద్యమకారులపై కారు, జీపులతో తొక్కించిన బిజెపికి చెందిన నరరూప రాక్షాసులను కటినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేశానికి అన్నంపెట్టే రైతులను అమానుషంగా చంపారన్నారు. బిజెపి పాలన దేశానికి పెద్ద ప్రమాదంగా ఉందని తెలిపారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకు రైతులు చేసే పోరాటానికి దేశ ప్రజలు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *